
నాలుగేళ్ల క్రితం మొదలైన ఓ కేసు ఇప్పుడు కొలిక్కి వచ్చింది. దింతో వీడియో స్ట్రీమింగ్ యాప్ యూట్యూబ్ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు రూ.217 కోట్లు చెల్లించనుంది. గూగుల్ యూట్యూబ్ తో ట్రంప్ చేసిన పోరాటంలో ట్రంప్ గెలిచారు. ట్రంప్ వేసిన కేసును ముగించడానికి యూట్యూబ్ $22 మిలియన్లు సుమారు రూ.183 కోట్లు చెల్లించాలని నిర్ణయించుకుంది. దీంతో పాటు, అమెరికన్ కన్జర్వేటివ్ యూనియన్ లాంటి ట్రంప్‌కు మద్దతు ఇచ్చే సంస్థలకు కూడా దాదాపు $2.5 మిలియన్లు అంటే సుమారు 21 కోట్లు చెల్లించనుంది. మొత్తంగా, యూట్యూబ్ $24.5 మిలియన్లు అంటే రూ.217 కోట్లు చెల్లించాల్సి వస్తోంది.
ఈ గొడవకి అసలు కారణం 2021 జనవరిలో కాపిటల్ హిల్ భవనంపై దాడి జరిగిన తర్వాత మొదలైంది. ఆ దాడి తర్వాతే యూట్యూబ్, ట్రంప్ అకౌంటును తొలగిస్తూ సస్పెండ్ చేసింది.
ట్రంప్ అకౌంట్ ఎందుకు తొలగించారంటే : ట్రంప్ 2021 అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తర్వాత 2021 జనవరి 6న ట్రంప్ మద్దతుదారులు యూఎస్ కాపిటల్ భవనంపై దాడి చేశారు. ఈ దాడిలో 140 మందికి పైగా పోలీసులకు గాయాలయ్యాయి.
ఈ హింసాత్మక ఘటన తర్వాత, మళ్ళీ హింస జరిగే అవకాశం ఉందని చెప్పి 12 జనవరి 2021న యూట్యూబ్ ట్రంప్ అకౌంటును తొలగించింది. అప్పుడే ఫేస్‌బుక్ ఇంకా ట్విట్టర్(X) కూడా ట్రంప్ అకౌంటును బ్లాక్ చేశాయి. దీంతో తన అకౌంటును అన్యాయంగా, సరైన నియమాలు లేకుండా తొలగించారని ఆరోపిస్తూ ట్రంప్.. యూట్యూబ్‌తో పాటు దాని మాతృ సంస్థ గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌పై కేసు వేశారు.
తన వాక్ స్వేచ్ఛను యూట్యూబ్ అణచివేస్తోందని ట్రంప్ ఆరోపిస్తూ, యూట్యూబ్ రాజ్యాంగ హక్కు (వాక్ స్వాతంత్రం)ను ఉల్లంఘించిందని అన్నారు. వాక్ స్వాతంత్రం హక్కు అనేది ప్రభుత్వానికే వర్తిస్తుంది తప్ప, యూట్యూబ్ లాంటి ప్రైవేట్ కంపెనీలకు కాదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ప్రైవేట్ కంపెనీలకు యాప్ లో ఏ కంటెంట్ ఉండాలనే దానిపై నియమాలు పెట్టుకునే స్వేచ్ఛ ఉంటుంది. యూట్యూబ్ ఈ వివాదాన్ని కోర్టులో కాకుండా బయట పరిష్కరించుకోవాలని, డబ్బిచ్చి ముగించాలని నిర్ణయించుకుంది.
వేరే కంపెనీలు కూడా: కేవలం యూట్యూబ్ మాత్రమే కాదు, ట్రంప్‌తో కేసులను పరిష్కరించుకున్న ఇతర కంపెనీలు కూడా ఉన్నాయి. ఈ ఏడాది మొదట్లో ఎలోన్ మస్క్ కంపెనీ X కూడా ట్రంప్‌తో కోటి రూపాయాల ఒప్పందం చేసుకుంది. ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా రెండున్నర కోట్లు చెల్లించింది, ఈ డబ్బు ట్రంప్ అధ్యక్ష గ్రంథాలయానికి వెళ్తుంది. పారామౌంట్ గ్లోబల్ అనే సంస్థ కూడా ఒక ఇంటర్వ్యూకి సంబంధించిన గొడవలో 1 కోటి 60 లక్షల డీల్ అంగీకరించింది. ఈ విధంగా, ట్రంప్ చాల పెద్ద టెక్ అండ్ మీడియా కంపెనీల నుండి కోర్టు కేసుల ద్వారా భారీ మొత్తంలో డబ్బు పొందారు.