
సెంట్రల్ ఫిలిప్పీన్స్ తీరంతో భారీ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై 6.9 తీవ్రతతో భూకంపం వచ్చిందని యూఎస్ జియోలాజకల్ సర్వే తెలిపింది. భూకంప కేంద్రం బోహోల్ ప్రావిన్స్‌లోని కాలాపేకు తూర్పు-ఆగ్నేయంగా 11 కిలోమీటర్ల దూరంలో ఏర్పడింది.
ఇక్కడ దాదాపు 33,000 మంది జనాభా ఉన్నారు. భూకంపంతో జనం బయటకు పరుగులు తీశారు. చాలా చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అయితే ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లలేదని వెల్లడించింది. సముద్ర మట్టంలో స్వల్పగా అలజడి ఉండొచ్చని తెలిపింది. లేట్, సెబు బిలిరాన్ మధ్య దీవుల మధ్య ఉండే వారిని అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఎలాంటి సునామీ ముప్పు లేదని తెలిపింది.