సర్కారుకు వ్యాట్​ ఎగ్గొట్టిన టానిక్

సర్కారుకు వ్యాట్​ ఎగ్గొట్టిన టానిక్

హైదరాబాద్, వెలుగు: టానిక్  మద్యం షాపులో అక్ర మాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఏ మద్యం షాప్​కూ లేని ప్రత్యేక అనుమతులు టానిక్ కు ఉన్నట్టు  జీఎస్టీ అధికారులు గుర్తించారు. ప్రభుత్వానికి రావాల్సిన వ్యాట్​ను ఎగ్గొట్టినట్లు తమ సోదాల్లో నిర్ధారించారు. ఇన్​వాయిస్​ బిల్లులలో వ్యాట్​ రాకుండా సర్కారు ఖజానా సొమ్మును కొల్లగొట్టినట్లు తేల్చారు. ప్రభుత్వానికి రావాల్సింది ఎంత మొత్తంలో ఎగ్గొట్టారనే దానిపై అధికారులు లెక్కలు తీస్తున్నారు. గత బీఆర్ఎస్  ప్రభుత్వం టానిక్ కు ఏ4 ఎలైట్  కింద లైసెన్స్  జారీ చేసింది. రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా ఎలైట్  అనుమతులు టానిక్ కు మాత్రమే గత ప్రభుత్వ హయాంలో అధికారులు కేటాయించారు. 

ఇది ఎక్సైజ్  పాలసీకి పూర్తి విరుద్ధంగా ఉందని అధికారులు తెలిపారు. 11 క్యూ టానిక్  ఎలైట్​ వైన్​ షాపులు ఉండగా అందులో బీఆర్ఎస్​ లీడర్లతో పాటు గత ప్రభుత్వంలో వివిధ హోదాల్లో పనిచేసిన ఉన్నతాధికారులకు కూడా ఈ వ్యవహారంతో సంబంధం ఉందని తెలిసింది.  బోడుప్పల్, గచ్చిబౌలి, మాదాపూర్ లో ముగ్గురు ఉన్నతాధికారులు, వారి కుటుంబ సభ్యుల పాత్ర ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గత సీఎంవోలో పనిచేసిన ఓ ఉన్నతాధికారి కొడుకు, ఒక ఎక్సైజ్  ఉన్నతాధికారి  కూతురు, మరో అడిషనల్  ఎస్పీ కూతురికి కూడా భాగస్వామ్యం ఉందని జీఎస్టీ అధికారులు గుర్తించారు. సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం దాకా కమర్షియల్​ ట్యాక్స్​  అధికారులు సోదాలు చేశారు. రాష్ట్రంలోని ఏ ప్రాంతం నుంచైనా, ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచైనా రకరకాల మద్యం బ్రాండ్లను తెప్పించుకునే వెసులుబాటు టానిక్ కు ఉందని ఎక్సైజ్‌‌‌‌‌‌‌‌ అధికారులు  తెలిపారు.