పారదర్శకత కోసమే సమాచారహక్కు చట్టం : బోరెడ్డి అయోధ్యారెడ్డి, పీవీ శ్రీనివాసరావు

పారదర్శకత కోసమే సమాచారహక్కు చట్టం : బోరెడ్డి అయోధ్యారెడ్డి, పీవీ శ్రీనివాసరావు

హనుమకొండసిటీ, వెలుగు: ప్రభుత్వ పాలనలో పారదర్శకత, అధికార యంత్రాంగంలో జవాబుదారీతనం సమాచార హక్కు చట్టం ముఖ్య ఉద్దేశమని రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్లు బోరెడ్డి అయోధ్యారెడ్డి, పీవీ శ్రీనివాసaరావు తెలిపారు. శుక్రవరం వరంగల్  కలెక్టరేట్ లో సమాచార కమిషనర్ ఆధ్వర్యంలో పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్లు (పీఐవో) అప్పిలేట్ అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. 

మూడేండ్లుగా 17వేల ఆర్టీఐ దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని, వాటిని ఆయా జిల్లాలు పర్యటించి అక్కడిక్కడే పరిష్కరిస్తామన్నారు. దరఖాస్తులు, ఫిర్యాదులు తక్కువగా ఉన్న జిల్లాల్లో వరంగల జిల్లా ఒకటి అని తెలిపారు. అనంతరం పెండింగ్ లోని దరఖాస్తులపై ఆర్టీఐ కమిషనర్లు విచారణ నిర్వహించారు. కమిషనర్లను వరంగల్ కలెక్టర్ సత్యశారద,  గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్, డీసీపీ అంకిత్ కుమార్ చేనేత డర్రీ బహూకరించి సన్మానించారు. అనంతరం హనుమకొండలోని గ్రేటర్​ వరంగల్​ ప్రెస్​క్లబ్​లో ప్రెసిడెంట్​ నాగరాజు, సభ్యుల ఆధ్వర్యంలో కమిషనర్లను సన్మానించారు.