మహిళలను అగౌరవపర్చినా కఠిన శిక్షలు తప్పవు

మహిళలను అగౌరవపర్చినా కఠిన శిక్షలు తప్పవు

లక్నో: ఉత్తర్ ప్రదేశ్‌‌లోని హత్రాస్, బల్‌‌రాంపూర్‌‌లో జరిగిన వరుస గ్యాంగ్‌‌రేప్ ఘటనలపై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. వీటిని నిరసిస్తూ విపక్షాలు శుక్రవారం ఆందోళనకు దిగాయి. యూపీ సీఎం యోగి ఆదిత్యానథ్‌‌పై ప్రతిపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మహిళలపై జరిగిన అమానుష ఘటనలపై యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. తాము మహిళల రక్షణకు కట్టుబడి ఉన్నామని యోగి స్పష్టం చేశారు. ‘రాష్ట్రంలో మహిళలను అగౌరవపర్చాలని చూసినా కఠిన శిక్షలు తప్పవు. ఈ శిక్షలు భవిష్యత్‌‌లో  ఉదాహరణలుగా చెప్పుకునేంత కఠినంగా ఉంటాయి. ప్రతి తల్లి, సోదరిని కాపాడేందుకు యూపీ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇదే మా సంకల్పం, ఇదే మా వాగ్దానం’ అని యోగి ట్వీట్ చేశారు.