
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర రెవెన్యూ శాఖలో పదోన్నతుల కోసం డిపార్టుమెంటల్ ప్రమోషన్ కమిటీని నియమిస్తూ రెవిన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీచేశారు. ఉత్తర్వులు ఈ నెల 18నే ఇచ్చినా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రెవెన్యూ శాఖలో అర్హులైనవారికి నయాబ్ తహసీల్దార్లు (ఫస్ట్ లెవెల్ గెజిటెడ్ ఆఫీసర్ ర్యాంక్)గా ప్రమోషన్ కల్పించే ఉద్దేశంతో సీసీఎల్ఏ (చీఫ్ కమిషనర్ ఆఫ్ లాండ్ అడ్మినిస్ట్రేషన్) చైర్మన్ కమ్ కన్వీనర్‌గా, ఎక్సైజ్ కమిషనర్, స్టాంపులు-రిజిస్ట్రేషన్ల విభాగం జాయింట్/అడిషనల్/డిప్యూటీ సెక్రటరీలను సభ్యులుగా ఈ కమిటీలో నియమించారు.
రెండేండ్ల పాటు ఈ కమిటీ పనిచేయనున్నది. అర్హులైనవారిని గుర్తించి వారికి నయాబ్ తహసీల్దారులుగా పదోన్నతి కల్పించేందుకు జాబితాను రూపొందిస్తుంది. దానికి అనుగుణంగా ప్రభుత్వం ప్రమోషన్లపై ఉత్తర్వులు ఇవ్వనున్నది.