భూటాన్ లో చుక్కలనంటుతున్న నిత్యావసర ధరలు 

భూటాన్ లో చుక్కలనంటుతున్న నిత్యావసర ధరలు 

భూటాన్ : భూటాన్ లో నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ద్రవ్యోల్బణం భారీగా పెరిగింది. కూరగాయలు, గుడ్ల ధరలు ఎన్నడూ లేని విధంగా గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. ప్రజలు మిర్చి, గుడ్లు కొనాలంటే భయపడే పరిస్థితి వచ్చింది. కరోనా కట్టడికి విధించిన లాక్ డౌన్ వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని నిపుణులు భావిస్తున్నారు. గుడ్ల ఉత్పత్తి భారీగా పడిపోవడం వల్ల వాటి ధరలు అమాంతం పెరిగాయి. ప్రస్తుతం అక్కడ ఒక్క గుడ్డు ధర రూ.50గా ఉంది. 

నిత్యావసర ధరలు ఇలా ఉంటే భూటాన్ ప్రభుత్వానికి మరో పెద్ద సమస్య వచ్చింది. ప్రభుత్వం పెట్టిన ఏడు రోజుల క్వారంటైన్ నిబంధన కారణంగా భారత్ నుంచి కార్మికులెవరూ అక్కడికి వెళ్లట్లేదు. దీంతో కార్మికుల కొరత ఏర్పడి పలు రంగాల్లో ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయింది. గుడ్ల కొరత తగ్గించేందుకు భూటాన్ దేశం భారత్ నుంచి దిగుమతిని పెంచింది. తమిళనాడు నుంచి పెద్ద మొత్తంలో గుడ్లు దిగుమతి చేసుకుంటోంది. మరోవైపు మిర్చి ధర కూడా కేజీ 600 రూపాయలకు చేరింది.

భూటాన్ లో జ్యూస్, వైన్ ఫ్యాక్టరీలు, ఆర్మీ వెల్ఫేర్ ప్రాజెక్టుల్లో పని చేసేందుకు ఇతర ప్రాంతాలకు చెందిన వందలాది మంది కార్మికులు ఉండేవారు. కానీ, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. అక్కడ  పని చేసేందుకు కార్మికులు లేరు. భారత్ నుంచి వలస వెళ్లిన వారు కూడా ఉపాధి కోల్పోయారు. భూటాన్ లో మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి ఉండే సూచనలు కన్పిస్తున్నాయని అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. 

మరిన్ని వార్తల కోసం..

టీఆర్, కవిత ప్రశ్నలకు రేవంత్ కౌంటర్

సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ లేఖ