పీజీ అడ్మిషన్స్ కు సీపీ గెట్

పీజీ అడ్మిషన్స్ కు సీపీ గెట్

రాష్ట్రంలోని ఎనిమిది యూనివర్సిటీల్లో వచ్చే విద్యా సంవత్సరం(2023-–24) సంప్రదాయ పీజీ, పీజీ డిప్లొమా, ఇంటిగ్రేటెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పీజీ కోర్సుల్లో అడ్మిషన్స్​కు నిర్వహించే కామన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రాడ్యుయేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎంట్రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌(సీపీగెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విడుదలైంది.
 

పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు: ఎంఏ, ఎంఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డబ్ల్యూ, ఎంహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎం, ఎంటీఎం, ఎంకాం, ఎంఈడీ, ఎంపీఈడీ, ఎంఎస్సీ, ఎంబీఏ, ఎంఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐబీఎస్సీ, బీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐబీఎస్సీ.

అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సు విభాగాలు: బయో-టెక్నాలజీ, కెమిస్ట్రీ/ ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ, అప్లైడ్ ఎకనామిక్స్, ఐఎంబీఏ.

పీజీ డిప్లొమా కోర్సులు విభాగాలు: చైల్డ్ సైకాలజీ, ఫ్యామిలీ మ్యారేజ్ కౌన్సెలింగ్, ఫోరెన్సిక్ సైన్స్, ఫార్మాస్యూటికల్ సైన్సెస్.

అర్హతలు: పీజీ, పీజీడీ కోర్సులకు కనీసం 40% మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ, బీఎడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌; ఐపీజీ కోర్సులకు కనీసం 50% మార్కులతో 10+2/ ఇంటర్మీడియట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉత్తీర్ణులై ఉండాలి. ఎంట్రన్స్​ టెస్ట్​, రిజర్వేషన్ రూల్ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు.

దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో జూన్​ 11 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చివరి వారం నుంచి ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్​లో ఎంట్రన్స్​ ఎగ్జామ్స్​ ఉంటాయి. పూర్తి వివరాలకు www.cpget.tsche.ac.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.