అమ్మాయిలూ వీటిని బ్యూటీ ప్రాడక్టులుగా వాడుతున్నారా.. నేచురల్ అయినా.. సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి జాగ్రత్త!

అమ్మాయిలూ వీటిని బ్యూటీ ప్రాడక్టులుగా వాడుతున్నారా.. నేచురల్ అయినా.. సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి జాగ్రత్త!

వంటింట్లో వాడే మసాలాలు.. పండ్లు.. కూరగాయలు.. ఇలా అన్నింటినీ అమ్మాయిలు బ్యూటీ ప్రొడక్ట్స్ గా వాడేస్తుంటారు. నిజం చెప్పాలంటే, ఆ ఫ్లేవర్లతోనే బయట ప్రొడక్ట్స్ తయారు చేస్తారు. కానీ చాలామంది అందులో ఏవి మంచివో, ఏవి చెడ్డవో తెలుసుకోకుండా, కొత్త సమస్యలు తెచ్చుకుంటారు. అయితే కొన్నింటిని వేరే వాటితో కలిపి వాడాలే తప్ప నేరుగా వాడొద్దు. అవేంటో చూద్దాం..

నిమ్మకాయ : అసిడిక్ నేచర్ గల ఈనిమ్మకాయను చర్మానికి డైరెక్ట్గా అప్లై చేయొద్దు. అలా చేస్తే చర్మం ఎర్రగా మారడంతో పాటు మంటగా ఉంటుంది. కావాలంటే -నిమ్మరసాన్ని అన్నిరకాల ఫేస్ ప్యాకుల్లో కొద్దిగా వేసి కలుపుకోవచ్చు. డైరెక్ట్గానే ట్రై చేయాలనుకుంటే.. ముందుగా చర్మంపై ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కనిపించకుంటే, అప్పుడు వాడుకోవచ్చు.

టూత్ పేస్ట్:  చాలామంది అప్పటికప్పుడు పింపుల్స్ (మొటిమలు) పోగొట్టుకోవడానికి టూత్పేస్ట్ ఉపయోగిస్తారు. ఎందుకంటే అది మొటిమల్ని త్వరగా కుచించుకుపోయేలా చేస్తుంది. కానీ అలా జరగడంతో మొటిమలోని పస్ బయటికి వెళ్లకుండా లోపలే ఉంటుంది. దాంతో ఇన్ఫెక్షన్ మరింత పెరుగుతుంది. అలాగే కొందరికి చర్మంపై దురద, దద్దుర్లు వంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి.

బేకింగ్ సోడా : సన్ ట్యాన్, డార్క్

సర్కిల్స్ పోవడానిడి బేకింగ్ సోడాను చాలామంది వాడతారు. కానీ ఇది అన్ని రకాల చర్మాలవాళ్లకు ఒకేలా పనిచేయదు. ముఖ్యంగా సెన్సిటివ్ స్కిన్ ఉన్నవాళ్లు దీన్ని వాడకపోవడమే మంచిది. ఇది ఆల్కలీన్ నేచర్ కలిగి ఉండటంవల్ల.. చర్మం ఎర్రగా మారడం, ముఖం ఉబ్బిపోవడం వంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి.

వెనిగర్: వైట్ వెనిగర్ లేదా యాపిల్ సైడర్ వెనిగర్ని బ్యూటీ ప్రొడక్ట్స్ లో భాగంగా వాడతారు. కానీ దీనివల్ల చర్మానికి మంచి కన్నా హాని ఎక్కువ కలుగుతుంది. దురద, రాషెస్ తో పాటు పిగ్మెంటేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

సాల్ట్ అండ్ షుగర్ (ఉప్పు, చక్కెర) :

ఉప్పుకైనా చక్కెరకైనా షార్ప్ ఎడ్జెస్ (గరుకుగా) ఉంటాయి. అందువల్ల వాటితో ముఖాన్ని స్క్రబ్ చేసినప్పడు, చర్మంపై పగుళ్లు, గాట్లు పడతాయి. సెన్సిటివ్ స్కిన్ ఉన్నవాళ్లు వీటిని డైరెక్ట్ గానే కాదు, ఎలాంటి ప్యాక్స్లోనూ వాడకపోవడం చాలా బెటర్.