అభ్యర్థులకు ఉమ్మడి గుర్తు ప్రాథమిక హక్కు కాదు: హైకోర్టు

అభ్యర్థులకు ఉమ్మడి గుర్తు ప్రాథమిక హక్కు కాదు: హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఉమ్మడి గుర్తు పొందడం అనేది ప్రాథమిక హక్కు కాదని హైకోర్టు తేల్చింది. ఎన్నికల గుర్తును ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం ప్రజాప్రాతినిధ్య చట్టం కింద మాత్రమే కేంద్ర ఎన్నికల సంఘం  కేటాయిస్తుందని చెప్పింది. ప్రజాప్రాతినిధ్య చట్టం 28ఏ సెక్షన్‌‌తోపాటు ఎన్నికల నిబంధనల్లోని 5, 10 ప్రకారం ప్రాథమిక హక్కుకు నియంత్రణ ఉందని తెలిపింది.  వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులకు ఉమ్మడి గుర్తును కేటాయించేలా ఈసీని ఆదేశించాలంటూ తెలంగాణ యువశక్తి పార్టీ అధ్యక్షుడు బి.రామ్మోహన్‌‌రెడ్డి వేసిన పిటిషన్‌‌ను చీఫ్‌‌ జస్టిస్‌‌ అలోక్‌‌ అరాధే, జస్టిస్‌‌ జె.అనిల్‌‌ కుమార్లతో కూడిన డివిజన్‌‌ బెంచ్‌‌ బుధవారం డిస్మిస్‌‌ చేసింది.