కామన్వెల్త్ క్రీడల్లో అపశ్రుతి.. గాయపడ్డ భారత మహిళా రేసర్

కామన్వెల్త్ క్రీడల్లో అపశ్రుతి.. గాయపడ్డ భారత మహిళా రేసర్

కామన్వెల్త్ క్రీడలు బర్మింగ్ హామ్ లో అట్టహాసంగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే భారత సైక్లిస్ట్ తీవ్రంగా గాయపడ్డారు. 10 కి.మీ. స్ర్కాచ్ రేసులో భాగంగా ఇండియన్ సైక్లిస్ట్ మీనాక్షి పోటీలో ఉండగా అదుపుతప్పి కిందపడ్డారు. ఆ సమయంలో ఆమె వెనకాలే వస్తున్న ప్రత్యర్థి న్యూజిల్యాండ్ సైక్లిస్ట్ బ్రయానీ బోథా సైకిల్ మీనాక్షిపై నుంచి దూసుకెళ్లడంతో .. తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. అది గమనించిన పోటీ నిర్వాహకులు వెంటనే స్పందించి స్ట్రెచర్ పై తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదిలా ఉండగా ఈ పోటీలో ఇంగ్లండ్ కు చెందిన లారా కెన్నీ బంగారు పతకాన్ని గెలుచుకుంది.

ఇటీవల ప్రారంభమైన కామన్వెల్త్ గేమ్స్ లో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. దీంతో భారత్ ఖాతాలో ఇప్పటివరకూ సాధించిన పతకాల సంఖ్య 9కి చేరింది. కాగా వీటిలో మూడు స్వర్ణాలు, మూడు రజతాలు, మూడు కాంస్య పతకాలను భారత్ కైవసం చేసుకుంది.