న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్‌లో ఇండియా నుంచి 215 మంది అథ్లెట్లు, 16 విభాగాల్లో పోటీ పడనున్నారు . బర్మింగ్‌హామ్ వేదికగా ఈ నెల 28 నుంచి జరిగే కామన్వెల్త్ గేమ్‌లో పోటీ పడే ఇండియా అథ్లెట్లకు ఐఓఏ గురువారం ఢిల్లీలో వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేసింది. ఈ ఈవెంట్‌కు హాజరైన సెంట్రల్ స్పోర్ట్స్ మినిస్టర్ అనురాగ్ ఠాకూర్ ఇండియా ట్రాక్ సూట్లను ఆవిష్కరించారు. ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్, జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఆరంభ వేడుకల్లో ఇండియా ఫ్లాగ్ బేరర్‌గా వ్యవహరించే అవకాశం ఉంది. మరోవైపు కామన్వెల్త్‌లో పాల్గొనే ఇండియా టీమ్ చెఫ్ డి మిషన్‌గా రాజేశ్ భండారి ఎంపికయ్యాడు. ఇక, కామన్వెల్త్ మెడలిస్టుకు ఇచ్చే ప్రైజ్‌మనీని ఐఓఏ సవరించింది. గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్‌కు వరుసగా 20, 10, 7.5 లక్షలు ఇవ్వనుంది.
