మహబూబ్నగర్ అర్బన్, వెలుగు : బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మహబూబ్నగర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో సహపంక్తి భోజనం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి అధ్యక్షుడితోపాటు ప్రభుత్వ విప్, మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి, రాష్ట్ర మైనార్టి ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, మేయర్ మమత, డిప్యూటీ మేయర్ ఎం.సురేందర్ రెడ్డి పాల్గొన్నారు.
అన్ని వర్గాల ప్రజలతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. అంతకుముందు అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి పూల మాలలు చేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బెక్కరి అనిత, నాయకులు చంద్రకుమార్ గౌడ్, వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

