కమ్యూనిటీ పార్టిసిపేషన్ కీలకం: డబ్ల్యూహెచ్​వో

కమ్యూనిటీ పార్టిసిపేషన్ కీలకం: డబ్ల్యూహెచ్​వో

జెనీవా: కరోనాపై పోరులో అధిక జనాభా కలిగిన ఇండియా లాంటి దేశాల్లో కమ్యూనిటీ పార్టిసిపేషన్ కీలకమని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రతినిధి డేల్ ఫిషర్ తెలిపారు. దశల వారీగా లాక్ డౌన్ ను ఎత్తి వేయాలన్న ఇండియా నిర్ణయం.. సరైన దిశగా వేస్తున్న ముందడుగని ఆయన పేర్కొన్నారు. కమ్యూనిటీల ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతున్నందున.. పరిష్కారం కూడా కమ్యూనిటీల నుంచే రావాలన్నారు. లాక్ డౌన్ తొలగిస్తే వ్యాధి సంక్రమణ తీవ్ర స్థాయిలో ఉంటుందని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ సామాజిక దూరాన్ని విధిగా పాటించాలని కోరారు.