వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫ్రమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హోమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉద్యోగులపై .. కంపెనీల నిఘా

వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫ్రమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హోమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉద్యోగులపై ..  కంపెనీల నిఘా

న్యూఢిల్లీ: చాలా కంపెనీలు ఇప్పటికీ రిమోట్ వర్కింగ్ విధానాన్ని ఫాలో అవుతున్నాయి. ఉద్యోగులు ఇంటి దగ్గర ఉండే జాబ్ చేస్తున్నారు. ఇటువంటి ఉద్యోగులపై కంపెనీలు నిఘా పెంచుతున్నాయి. ఇందుకోసం స్పెషల్ సాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్లను వాడుతున్నాయి. బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిపోర్ట్ ప్రకారం, గ్లోబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా చాలా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న తమ ఉద్యోగులను స్పెషల్ సాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లతో వర్కింగ్ అవర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో   ట్రాక్ చేస్తున్నాయి. పని చేయడం లేదని తెలిస్తే  వెంటనే తీసేస్తున్నాయి.  ఉదాహరణకు  ఆస్ట్రేలియాకు చెందిన ఓ మహిళ  ఇలానే తన జాబ్  కోల్పోయింది. కీస్ట్రోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాక్టివిటీ సాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ( కీబోర్డ్ వాడకం) ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారా కిందటేడాది అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–డిసెంబర్ మధ్య ఆమె పనిని కంపెనీ విశ్లేషించింది. 

కన్సల్టెంట్ రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పనిచేసిన ఆమె  గంటకు కనీసం 500 కీస్ట్రోక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  అయిన వాడాలి. ఆమె సగటు 100 మాత్రమే ఉంది. కీబోర్డు పెద్దగా వాడడం లేదని గుర్తించిన కంపెనీ  ఆమెను జాబ్ నుంచి తీసేసింది.  కంపెనీలు రిమోట్ వర్కింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విధానంపై పాజిటివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గానే ఉన్నా, ప్రొడక్టివిటీ సరిగ్గా లేకపోతే ఈ విధానం వేస్ట్ అని భావిస్తున్నాయి. చాలా మంది ఉద్యోగులు రిమోట్ వర్కింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని లూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హోల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను వాడుకొని పని ఎగ్గొడుతున్నారు. అందుకే కంపెనీలు ఉద్యోగులు కీస్ట్రోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను చెక్ చేయడం వంటివి చేస్తున్నారు. కొన్ని కంపెనీలయితే వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్యామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారా ఉద్యోగులు పనిచేస్తున్నప్పుడు గమనిస్తున్నాయి కూడా. 

వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ పని ఎగ్గొట్టిన ఇద్దరు ఉద్యోగులను ఎలా పట్టుకున్నాడో తెలియజేస్తూ మైఖల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాట్రన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అనే వ్యక్తి ట్వీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. మౌస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మూవింగ్ టెక్నాలజీతో వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మిమిక్ చేశారని, కానీ  నిజానికి పని చేసేవారు కాదని ఆయన అన్నారు. ఎంప్లాయీ మానిటరింగ్ సాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టైమ్ డాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాయంతో ఈ ఉద్యోగుల స్క్రీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రికార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశానని, వారి లాగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెక్ చేశానని వివరించారు. ప్రతీ ఉద్యోగిని ట్రాక్ చేయమని,  డెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు మిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యి, మెసేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు రిప్లే ఇవ్వని ఉద్యోగులను మాత్రమే ట్రాక్ చేశామని చెప్పారు. ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రిమోట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వర్క్స్ చేసేవారిపై మానిటరింగ్ ఈ మధ్య కాలంలో బాగా పెరిగిందని ఉద్యోగులు కూడా చెబుతున్నారు.