చైనాలో ఫ్యాక్టరీలు రీ ఓపెన్

చైనాలో ఫ్యాక్టరీలు రీ ఓపెన్

బీజింగ్‌‌‌‌: కరోనా దెబ్బతో మూతపడిన చైనా ఫ్యాక్టరీలు తిరిగి తమ కార్యకలాపాలను ప్రారంభిస్తున్నాయి. ముఖ్యంగా ఆటోమొబైల్‌‌‌‌ కంపెనీలు తమ ప్రొడక్షన్‌‌‌‌ను రీస్టార్ట్‌‌‌‌చేశాయి. దీంతో పాటు కొన్ని విమాన సర్వీసులను కూడా చైనా తిరిగి ప్రారంభించింది.  వైరస్‌‌‌‌వ్యాప్తి నెమ్మదించడంతో ప్రజలు వాహనాలు కొనడానికి షోరూమ్‌‌‌‌లకు వస్తున్నారని  చైనా ఆటోమోటివ్‌‌‌‌ ఇండస్ట్రీ ప్రతినిధులు తెలిపారు. కాగా కరోనా వైరస్‌‌‌‌గ్లోబల్‌‌‌‌గా విస్తరించడంతో చాలా దేశాలలో ఫ్యాక్టరీ ప్రొడక్షన్‌‌‌‌ నిలిచిపోయింది. ముఖ్యంగా యూరప్‌‌‌‌, అమెరికా, ఇండియా, లాటిన్‌‌‌‌అమెరికాలలో ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. ఇలాంటి పరిస్థితులలో అతిపెద్ద రెండవ ఎకానమీ అయిన చైనా తిరిగి తమ ఫ్యాక్టరీ ప్రొడక్షన్‌‌‌‌ను ప్రారంభించడం, గ్లోబల్‌‌‌‌ఎకానమీకి మంచిదని విశ్లేషకులు అంటున్నారు.

ఫోర్డ్‌‌‌‌, బీఎండబ్యు, హోండా..రీస్టార్ట్‌‌‌‌

ఇండస్ట్రియల్‌‌‌‌కాంప్లెక్స్‌‌‌‌లు తిరిగి ప్రారంభమయ్యాయనే విషయాన్ని రియల్‌‌‌‌టైమ్‌‌‌‌ఇండికేటర్లు చెబుతున్నాయని శాన్‌‌‌‌ఫోర్డ్‌‌‌‌సీ. బెర్నెస్టెయిన్‌‌‌‌లో పనిచేస్తున్న విశ్లేషకులు అన్నారు. చైనాలో పరిస్థితులు నెమ్మదిగా మెరుగవుతున్నాయని తెలిపారు. లోకల్‌‌‌‌, గ్లోబల్‌‌‌‌కంపెనీలు చైనాలో తమ ప్రొడక్షన్‌‌‌‌తిరిగి ప్రారంభించాయని బ్లూమ్‌‌‌‌బర్గ్‌‌‌‌రిపోర్ట్‌‌‌‌చేసింది. చైనాలోని షెంగ్‌‌‌‌యంగ్‌‌‌‌ప్లాంట్‌‌‌‌ను బీఎండబ్లూ తిరిగి తెరిచింది. చైనాలోని తమ ప్లాంట్లలో ప్రొడక్షన్‌‌‌‌ను పెంచుతున్నామని ఫోర్డ్‌‌‌‌పేర్కొంది. చైనాలో కంపెనీకి చెందిన రెండువెంచర్లు తమ సాధారణ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించాయని హోండా తెలిపింది. నిస్సాన్‌‌‌‌కూడా దేశంలోని తమ ఫ్యాక్టరీలన్ని తిరిగి ఓపెన్‌‌‌‌అయ్యాయని పేర్కొంది. టెస్లా షాంఘై ప్లాంట్‌‌‌‌కూడా తిరిగి ఫ్యాక్టరీ ప్రొడక్షన్‌‌‌‌ను ప్రారంభించింది. ఈ కంపెనీకి అమెరికాకు వెలుపల ఒకే ఒక్క ప్లాంట్‌‌‌‌ఉంది. అది కూడా షాంఘైలో ఉంది. చైనాలో పనులు తిరిగి ప్రారంభమవుతున్నప్పటికి ముందుకెళ్లే కొద్ది గ్లోబల్‌‌‌‌ఎకానమీ రికవరీ అవ్వడం అంత సులువు కాదని విశ్లేషకులు తెలిపారు.

చిక్కుకుపోయినం.. ఆదుకోండి