డబ్బు మేం కడతాం.. జిమ్ కు వెళ్లి స్లిమ్ అవ్వండి

డబ్బు మేం కడతాం.. జిమ్ కు వెళ్లి స్లిమ్ అవ్వండి

చాలా కంపెనీలు తమ సంస్థలోని ఉద్యోగులకు అదనపు సౌకర్యాలు కల్పిస్తూ ఉంటాయి.  పికప్ అండ్ డ్రాపింగ్.. టీ . స్నాక్స్ .. లంచ్ ఇలా అనేక రకాలుగా ఆ కంపెనీ యాజమాన్యం బట్టి నిర్ణయం తీసుకొంటుంది.  కొన్ని కంపెనీల్లో అసలు ఏమీ ఉండవనుకోండి.  కాని తాజాగా న్యూట్రిషన్ సొల్యూషన్స్ తన  కంపెనీ ఉద్యోగుల ఫిట్ నెస్ గురించి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంది.  ఫిట్ గా , ఆరోగ్యంగా ఉండేందుకు  ఉద్యోగులను జిమ్ కు వెళ్లాలని.. అందుకు అయ్యే ఖర్చు తామే భరిస్తామని తెలిపింది.   ఉద్యోగులు ఫిట్ గా ఉండేందుకు  ఉదయం , సాయంత్రం శిక్షణ కూడాఇస్తామని ప్రకటించింది.

జిమ్ చేయడం వలన మానసికంగా.. శారీరకంగా ధృడంగా ఉంటారని కంపెనీ యాజమాన్యం ప్రకటించింది. న్యూట్రిషన్ సొల్యూషన్స్ తమ ఉద్యోగులను ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉంచేందుకు కంపెనీలు పలు చర్యలు తీసుకుంది.  ఉద్యోగుల అలసట తగ్గేందుకు మానసికంగా.. శారీరకంగా ధృడంగా ఉండేందుకు విశ్రాంతి తీసుకోవడం కోసం ప్రత్యేక గదులు, ఆడుకొనేందుకు పలు సౌకర్యాలు కల్పించింది.   అంతేకాకుండా జిమ్ కు వెళ్లేందుకు తన కంపెనీ ఉద్యోగులకు స్పెషల్ అలవెన్స్ లు ఇస్తామని  కంపెనీ సీఈవో  క్రిస్ కవల్లి ప్రకటించారు.  . 

 ఏ స్థాయి ఉద్యోగికి అయినా  వారికి  జీతంతో సంబంధం లేకుండా అదనపు అలవెన్స్ లు ఇస్తామని ప్రకటించింది.  ఈ ఆఫర్ ను కంపెనీలో పనిచేస్తున్నంత వరకు వర్తిస్తుందని సీఈవో తెలిపారు.  ఉద్యోగులందరూ ప్రతి బుధ, శుక్ర వారాల్లో నిర్వహించే యోగా తరగతులకు హాజరుకావాలని తెలిపారు.   అయితే ఈ సమయాన్ని ఓవర్ టైమ్ గా పరిగణించే అవకాశం ఉందన్నారు సీఈవో. 
ఉద్యోగులు ఎన్నిసార్లయినా ఈ పథకం ప్రయోజనాలను పొందవచ్చంటూ,, . ప్రతి సెషన్‌కు వారికి ప్రోత్సాహకాలు కూడా ఇస్తామన్నారు.