మార్కెట్‌‌ ధర కంటే మూడొంతుల తక్కువకే ఉద్యోగులకు కంపెనీ షేర్లు

మార్కెట్‌‌ ధర కంటే మూడొంతుల తక్కువకే ఉద్యోగులకు కంపెనీ షేర్లు

బీపీసీఎల్‌‌ ఉద్యోగులకు కంపెనీ షేర్లు

ఈఎస్‌‌పీ స్కీమ్‌‌ను ఆమోదించిన కంపెనీ బోర్డ్‌‌

న్యూఢిల్లీ: మార్కెట్‌‌ ధర కంటే మూడొంతుల తక్కువకే కంపెనీ షేర్లను ఆయిల్‌‌ మార్కెటింగ్‌‌ కంపెనీ బీపీసీఎల్‌‌ తన ఉద్యోగులకు ఆఫర్‌‌‌‌ చేస్తోంది. ఈ ఆఫర్‌‌‌‌ను కంపెనీలోని కొంత మందికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఎంప్లాయ్‌‌ స్టాక్‌‌ పర్చేజ్‌‌ స్కీమ్‌‌(ఈఎస్‌‌పీఎస్)కు బీపీసీఎల్‌‌ బోర్డ్‌‌ శుక్రవారం ఆమోదం తెలిపింది. ఈ ఉద్యోగులను షేర్‌‌‌‌ హోల్డర్ల ఆమోదంతో గుర్తిస్తారు. ఈ స్కీమ్‌‌కు  కంపెనీ డైరక్టర్లు కూడా అర్హులే. కంపెనీలో ఉద్యోగి గ్రేడ్‌‌ ను బట్టి ఎన్ని షేర్లను ఆఫర్ చేయోలో నిర్ణయిస్తారు. ‘బీపీసీఎల్‌‌ ట్రస్ట్‌‌ ఫర్‌‌‌‌ ఇన్వెస్ట్‌‌మెంట్‌‌ ఇన్‌‌ షేర్స్‌‌’ సంస్థకు బీపీసీఎల్‌‌ పెయిడప్‌‌ షేర్‌‌‌‌ క్యాపిటల్‌‌లో 9.33 శాతం వాటా ఉంది. ఇందులో 2 శాతాన్ని ఉద్యోగులకు ఈఎస్‌‌పీఎస్‌‌ కింద ఆఫర్‌‌‌‌ చేయాలని కంపెనీ చూస్తోంది.  ట్రస్ట్‌‌ వద్ద మిగిలిన 7.33 శాతం వాటాను ఏం చేయాలో కంపెనీ ఇంకా నిర్ణయించలేదు. ఈఎస్‌‌పీఎస్‌‌ కింద కంపెనీ షేర్లను కొనుగోలు చేసిన ఉద్యోగులు ఏడాది వరకు వీటిని అమ్మకూడదు.

For More News..

కొత్త బండ్లకు డిస్కౌంట్​ కావాలంటే ఇలా చేయాల్సిందే

అడిగినోళ్లందరికీ కరోనా టెస్టులు

హెచ్‌‌‌‌‌‌‌‌సీఏ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌ అజరుద్దీన్​పై మెంబర్స్​ తిరుగుబాటు!