విష జ్వరాలతో ఇంటికొకరు మంచాన పడుతున్నరు

విష జ్వరాలతో ఇంటికొకరు మంచాన పడుతున్నరు

గత రెండేళ్లతో పోలిస్తే ఈ ఏడాది వైరల్ ఫీవర్స్ జనాన్ని వణికిస్తున్నాయి. ఇంటికొకరు మంచాన పడుతున్నారు. కొందరిలో సివియర్ గా ఫ్లూ సింటమ్స్ కనిపిస్తుండటంతో... హాస్పిటల్ లో అడ్మిట్ అవుతున్నారు. అయితే.. ప్లూ నుంచి తప్పించుకోవాలంటే.. వ్యాక్సిన్లు తీస్కోవాలంటున్నారు డాక్టర్లు.  ముందస్తుగా వ్యాక్సిన్లు తీస్కుంటే.. వ్యాధిని తట్టుకోవడంతో పాటు తక్కువ లక్షణాలతో బయటపడతారని చెబుతున్నారు. 

ఏడాది మొత్తం కనిపించనన్ని వ్యాధులు ఈ వానాకాలంలోనే ఎటాక్ చేస్తున్నాయి. రెండేళ్ళుగా కరోనా వణికిస్తే.... ఈ ఏడాది విష జ్వరాలతో ఇంటికొకరు మంచాన పడుతున్నారు. కరోనాకి ముందున్న లైఫ్ స్టైల్ రావడంతో.. వ్యాధులు కూడా విజృంభిస్తున్నాయి. డెంగీ, టైఫాయిడ్, మలేరియా, స్వైల్ ప్లూ..లాంటి వ్యాధుల బారిన పడుతున్నారు జనం. 

మూడేళ్లుగా.. తగ్గిన స్వైన్ ఫ్లూ ఈ ఏడాది విరుచుకుపడుతోంది. స్వైన్ ఫ్లూ రాకుండా ముందుగా వ్యాక్సిన్ తీసుకుంటే సివియర్ గా రాదంటున్నారు డాక్టర్లు. ఇతర వ్యాధులతో సఫర్ అవుతున్నవాళ్లు ముందస్తుగా ప్లూ షాట్ తీస్కోవడం వల్ల.. వ్యాధి తీవ్రత తగ్గుతుందని చెప్పారు. రెండేళ్ళుగా ఇది తీసుకోకపోవడం వల్లే ఈ ఏడాది కేసులు పెరిగాయన్నారు. 

 స్వైన్ ప్లూ వ్యాక్సిన్ నాలుగు రకాల వ్యాధులపై పనిచేస్తుంది. H1N1తో పాటు.. ప్లూ సింటమ్స్ రాకుండా చూస్తుంది. ఒకవేళ వచ్చినా వ్యాధి తీవ్రత లేకుండా చేస్తుంది. ఈ టీకా పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ తీస్కోవచ్చు. కొన్ని దేశాల్లో ప్లూ షాట్ పేరుతో సూపర్ మార్కెట్లలో కూడా అందుబాటులో ఉంటుంది. మన దేశంలో మాత్రం.. ఈ టీకాలు  పెద్దగా వేసుకోవడం లేదు. రెండు డోసుల ప్లూ షాట్ ముందుగా తీసుకోవడం మంచిదే అంటున్నారు డాక్టర్లు.  

స్వైన్ ప్లూ వ్యాక్సిన్ ధర వెయ్యి లోపే ఉంటుంది. యాంటీ బాడీలు 6 నుంచి 8 నెలలు మాత్రమే ఉంటాయి అందువల్ల ప్రతి ఏడాది ఫ్లూ వ్యాక్సిన్  తీసుకోవాలని సూచిస్తున్నారు.  ఇతర రోగాలతో సఫర్ అవుతున్నవారికి వ్యాక్సిన్ తీస్కుంటే ప్రాణాల మీదకు రాదంటోన్నారు డాక్టర్లు.  

హెల్త్ సెక్టార్ లో పనిచేసేవారితో పాటు పోలీసులు, మున్సిపల్ సిబ్బంది ఈ ఫ్లూ షాట్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. కరోనా వ్యాక్సిన్లను కూడా నిర్లక్ష్యం చేయొద్దని చెబతున్నారు డాక్టర్లు. వ్యాధి వచ్చాక జాగ్రత్త పడటం కంటే రాక ముందే చర్యలు తీసుకోవడం మంచిదంటున్నారు.