మోల్డ్ టెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లాభం రూ.19.4 కోట్లు

మోల్డ్ టెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లాభం రూ.19.4 కోట్లు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌: ప్యాకేజింగ్‌‌‌‌‌‌‌‌ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బిజినెస్‌‌‌‌‌‌‌‌ చేస్తున్న  మోల్డ్‌‌‌‌‌‌‌‌టెక్‌‌‌‌‌‌‌‌ ప్యాకేజింగ్‌‌‌‌‌‌‌‌కు  సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌తో ముగిసిన క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (క్యూ2) లో  రూ.19.4 కోట్ల నికర లాభం (స్టాండ్ ఎలోన్‌‌‌‌‌‌‌‌) వచ్చింది.  కిందటేడాది  సెప్టెంబర్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వచ్చిన లాభంతో  పోలిస్తే ఈ సారి కంపెనీ ఫ్రాఫిట్‌‌‌‌‌‌‌‌ 10.4 శాతం పెరిగింది. ఇబిటా 6.15 శాతం ఎగిసి రూ.34.24 కోట్లకు,  టర్నోవర్‌‌‌‌‌‌‌‌ 14.4 శాతం పెరిగి రూ.182.5 కోట్లకు చేరుకున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్త ప్లాంట్ కోసం, ఇప్పటికే అందుబాటులో ఉన్న ప్లాంట్లను విస్తరించడం కోసం రూ.50 కోట్లు ఖర్చు చేశామని కంపెనీ పేర్కొంది.  మరో రూ.75 కోట్లు ఖర్చు చేయనున్నట్టు మోల్డ్‌‌‌‌‌‌‌‌టెక్‌‌‌‌‌‌‌‌ ప్యాకేజింగ్‌‌‌‌‌‌‌‌ ఎండీ జే లక్ష్మణరావు తెలిపారు. ఈ ప్రాజెక్టులు మరో 6-9 నెలల్లో పూర్తి కానున్నాయని వెల్లడించారు.

ఓటీసీ ఉత్పత్తుల కోసం ఏర్పాటు చేసిన  ఇంజెక్షన్‌‌‌‌‌‌‌‌ బ్లో మౌల్డింగ్‌‌‌‌‌‌‌‌ (ఐబీఎం) ప్యాకేజింగ్‌‌‌‌‌‌‌‌ ప్లాంటులో  వచ్చే ఏడాది స్టార్టింగ్‌‌‌‌‌‌‌‌లో ప్రొడక్షన్ స్టార్టవుతుందని చెప్పారు.   ఫార్మా ఉత్పత్తుల కోసం ఐబీఎం ఫెసిలిటీలను ఏప్రిల్‌‌‌‌‌‌‌‌లో  ఏర్పాటు చేస్తామని అన్నారు. కస్టమర్ల నుంచి డిమాండ్‌‌‌‌‌‌‌‌  పెరగడంతో  హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వైజాగ్‌‌‌‌‌‌‌‌, మైసూర్‌‌‌‌‌‌‌‌, సతారా ప్రాజెక్టుల సామర్థ్యం పెంచామని వివరించారు. ఆదిత్య బిర్లా గ్రూప్‌‌‌‌‌‌‌‌ కోసం రూ.30 కోట్లతో హర్యానాలో ప్లాంటు ఏర్పాటు చేస్తున్నామన్నారు. డామన్‌‌‌‌‌‌‌‌లో రెండవ ప్లాంటు స్థాపించేందుకు స్థలం సేకరించామని చెప్పారు. విద్యుత్‌‌‌‌‌‌‌‌ వ్యయాలను తగ్గించుకునేందుకు అన్ని యూనిట్లలో సోలార్‌‌‌‌‌‌‌‌  ప్యానెళ్లను ఏర్పాటు చేస్తున్నామని లక్షణరావు వివరించారు.