వరి వేస్తే ఉరి అని చెప్పటంతోనే సాగు విస్తీర్ణం తగ్గింది

వరి వేస్తే ఉరి అని చెప్పటంతోనే సాగు విస్తీర్ణం తగ్గింది

కేసీఆర్ వరి వేస్తే ఉరి అని చెప్పటంతోనే సాగు విస్తీర్ణం తగ్గిందన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. తక్కువధరకు ధాన్యం అమ్ముకున్న రైతులకు రూ.600 బోనస్ ఇవ్వాలని.. వరిసాగు చేయని రైతులకు ఎకరాకు 15 వేల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని  డిమాండ్ చేశారు. ప్రభుత్వం, మిల్లర్లు కుమ్మక్కై రైతులను దోచుకుంటున్నారన్నారు. ఈ కుంభకోణం పై సీబీఐ విచారణ జరిపించాలన్నారు. మిల్లర్లతో ప్రభుత్వం కుమ్మక్కై రూ.3 వేల కోట్ల కుంభకోణం చేసిందని ధ్వజమెత్తారు. ఎఫ్‌సీఐకి చెందిన బియ్యం మాయమయ్యాయన్నారు.కేసీఆర్‌ అధికార ఉన్మాదిగా మారి దోచుకుంటున్నారని మండిపడ్డారు. బియ్యం మాయమైన ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మంత్రి పువ్వాడ అజయ్ నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. అక్రమ కేసులతో కాంగ్రెస్‌ కార్యకర్తలను వేధిస్తున్నారన్నారు. నిజాంకు పట్టిన గతే కేసీఆర్‌కు పడుతుందని రేవంత్‌రెడ్డి అన్నారు.