అమిత్ షా, ఖర్గేలది తిట్లలో పోటీ.. మాది కిట్లలో పోటీ : మంత్రి హరీశ్రావు

అమిత్ షా, ఖర్గేలది తిట్లలో పోటీ.. మాది కిట్లలో పోటీ : మంత్రి హరీశ్రావు

వాళ్లు వస్తారు.. తిడతారు.. వెళతారు.. వాళ్లెవరో కాదు.. ఒకరు అమిత్ షా.. మరొకరు ఖర్గే.. వాళ్లది తిట్లలో పోటీ.. మాది కేసీఆర్ సంక్షేమ తిట్లలో పోటీ అంటూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చురకలు అంటించారు మంత్రి హరీశ్ రావు. హైదరాబాద్ కేంద్రంగా కాంగ్రెస్ సీడబ్ల్యూసీ, బీజేపీ విమోచన దినోత్సవాలను నిర్వహించటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి హరీశ్. కాంగ్రెస్ ది బట్ట కాల్చే మీద వేసే సంస్కృతి అని..  ప్రతిపక్షాల పాలనకు మా పాలనకు నక్కకు నాగ లోకానికి ఉన్నంత తేడా ఉందంటూ గతంలో జరిగిన తప్పులను ఎత్తిచూపారు మంత్రి. కాంగ్రెస్ లో కుమ్ములాటలే ఎక్కువ.. కాంగ్రెస్ పార్టీదీ తన్నుల సంస్కృతి.. మాది టన్నుల కొద్దీ పంటలు పండించే సంస్కృతి అంటూ ప్రభుత్వ విజయాన్ని గుర్తు చేశారాయన. 

తెలంగాణ రాష్ర్టం అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది.. దేశానికే దిక్సూచీగా మారిందన్న మంత్రి హరీశ.. దేశంలో 3 శాతం జనాభా ఉన్న తెలంగాణ అభివృద్ధిలో ఎన్నో అవార్డులు సాధించింది కేంద్రంలోని బీజేపీకి కనిపించటం లేదా అని ప్రశ్నించారాయన. ధాన్యం ఉత్పత్తిలో హర్యానా, పంజాబ్ లను వెనక్కి నెట్టి.. దేశానికి ధాన్యాగారంగా తెలంగాణను మార్చిన ఘనత కేసీఆర్ ది కాదా అని నిలదీశారు బీజేపీని. 

పాలమూరు ప్రాజెక్టుకు కేంద్రంలోని బీజేపీ సర్కార్ అనుమతులు ఇవ్వకుండా ఆలస్యం చేసిందని.. రైతు సంక్షేమానికి  కాంక్షించే రాష్ట్ర ప్రభుత్వం.. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా..  ఓ యజ్ఒంగా  కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసి ఉత్తర తెలంగాణ ను సస్యశ్యామలం చేసింది. మరోవైపు  పాలమూరు ప్రాజెక్టుతో దక్షిణ తెలంగాణ ను సస్యశ్యామలం అవుతున్న విషయం ప్రతిపక్ష పార్టీలకు కనిపించడం లేదా అన్ని ప్రశ్నించారు మంత్రి హరీష్ రావు. 

రాష్ట్ర ప్రభుత్వం అందరికి ఉచిత వైద్యం అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోందని.. అన్ని జిల్లా, పట్టణాల్లో వైద్య సదుపాయాలు మెరుగుపర్చిన విషయం కల్లకు కట్టినట్టు కనిపిస్తోంచడంలేదా అని ప్రశ్నించారు మంత్రి హరీశ్ రావు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఒక్క మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయకున్నా.. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకో మెడికల్ కాలేజీనీ మంజూరు చేసి నిర్మించింది.. దేశానికి వైద్య అవసరాలు తీర్చేందుకు డాక్టర్లను తయారు చేస్తూ.. మెడికల్ కార్ఖానాగా మారిన విషయం ప్రతిపక్షాలకు ఎందుకు కనిపించడం లేదని  మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.