ఐదేళ్లలో తైవాన్‌‌‌‌, సౌత్‌‌‌‌ కొరియాకు పోటీ

ఐదేళ్లలో తైవాన్‌‌‌‌, సౌత్‌‌‌‌ కొరియాకు పోటీ

 న్యూఢిల్లీ : చిప్‌‌‌‌ల తయారీలో తైవాన్‌‌‌‌, సౌత్‌‌‌‌ కొరియాతో పోటీ పడాలని ఇండియా చూస్తోంది. వచ్చే ఐదేళ్లలోనే ఈ దేశాల సరసన నిలబడతామని  యూనియన్ మినిస్టర్ అశ్వినీ వైష్ణవ్‌‌‌‌ ధీమా వ్యక్తం చేశారు. గ్లోబల్ కంపెనీల ఆలోచన విధానం మారిందని, దేశంలో ఇన్వెస్ట్ చేసేందుకు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారని అన్నారు. గతంలో  ఇండియాకు  ఎప్పుడు వెళ్లాలని ఆలోచించే ఇన్వెస్టర్లు, ప్రస్తుతం ఎంత వేగంగా వెళ్లాలని ఆలోచిస్తున్నారని పేర్కొన్నారు. 

ఏఐ కంపెనీలను ఆకర్షించేందుకు ప్రభుత్వం భారీ మొత్తంలో రాయితీలను ప్రకటించింది. ఇండియాలో  కంపెనీలు ప్లాంట్ పెడితే ఖర్చులో  సగం భరిస్తోంది.  ఇండియా వంటి పెద్ద దేశాల్లో సెమీకండక్టర్ల సప్లయ్ చెయిన్ ఇంటర్నల్‌‌‌‌గా ఏర్పాటవ్వడం చాలా కీలకమని వైష్ణవ్‌‌‌‌ అన్నారు.  సెమీకండక్టర్ ఇండస్ట్రీ ప్రభావం ఆటోమొబైల్‌‌‌‌, ఈవీ, ఎలక్ట్రానిక్స్‌‌‌‌, డిఫెన్స్‌‌‌‌ వంటి ప్రతీ మాన్యుఫాక్చరింగ్ సెక్టార్‌‌‌‌‌‌‌‌పై ఉంటుందని చెప్పారు.