ఎమ్మెల్యే రాజాసింగ్పై ఫిర్యాదు

ఎమ్మెల్యే రాజాసింగ్పై ఫిర్యాదు

వర్ని,వెలుగు: మహ్మద్​ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్​ పై శుక్రవారం ముస్లిం నాయకులు రుద్రూర్​ పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. మధ్యప్రదేశ్​లోని ఇండోర్​ లో జరిగిన ఓ కార్యక్రమంలో రాజాసింగ్ మహ్మద్​ ప్రవక్తపై అవమానకరమైన వ్యాఖ్యలు చేశారన్నారు. 

 కార్యక్రమంలో రుద్రూర్​ జామామసీద్​ సదర్​ జహుర్​, మజీద్​ సదర్​ మహ్మద్​ ఇమ్రాన్​ ఖాద్రి, అక్బర్​నగర్​ మజీద్​ సదర్​ షేక్​ మహ్మద్​, ఖిద్మత్​ ఫౌండేషన్​ అద్యక్షుడు సయ్యద్​ ముల్తాని, ముస్లిం మైనార్టీ డెవలప్మెంట్​ ఫోరం అధ్యక్షుడు లాల్​ మహ్మద్ పాల్గొన్నారు.