కరోనా ఉధృతి.. తమిళనాడులో లాక్‌డౌన్

కరోనా ఉధృతి.. తమిళనాడులో లాక్‌డౌన్

చెన్నై: తమిళనాడులో కరోనా ఉధృతి పెరుగుతుండటంతో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే రెండు వారాల పాటు లాక్‌డౌన్ విధిస్తున్నట్లు స్టాలిన్ ప్రభుత్వం తెలిపింది. ఈ నెల 10వ తేదీ నుంచి లాక్‌డౌన్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయని స్పష్టం చేసింది. ఈ టైమ్‌‌లో కాయగూరలు, కిరాణా సామాన్లు, మాంసపు ఉత్పత్తులను మధ్యాహ్నం 12 గంటల్లోపు కొనుక్కోవడానికి అవకాశం కల్పిస్తున్నామని ప్రభుత్వం పేర్కొంది. అమ్మ క్యాంటీన్లు తెరిచి ఉంటాయని తెలిపింది. ప్రైవేటు సంస్థలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. రోడ్ల పైకి మాత్రం పెళ్లిళ్లు, అంత్యక్రియలు, పరీక్షలు, ఉద్యోగ నియమాకాల ఇంటర్వ్యూలకు వెళ్లే క్యాబ్‌లు, ఆటోలను మాత్రమే అనుమతించనున్నారు.