రాష్ట్రస్థాయి కబడ్డీ విజేత ఖమ్మం... ముగిసిన అండర్ -17 పోటీలు

రాష్ట్రస్థాయి కబడ్డీ విజేత ఖమ్మం... ముగిసిన అండర్ -17 పోటీలు

పినపాక, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం జడ్పీ స్కూల్​లో మూడురోజులుగా నిర్వహించిన 69వ స్టేట్​లెవల్​అండర్​-–17 బాల బాలికల కబడ్డీ పోటీలు సోమవారం  ముగిశాయి. రాష్ట్రంలోని ఉమ్మడి పది జిల్లాల నుంచి పాల్గొన్న క్రీడాకారుల నడుమ పోటీలు ఉత్కంఠతో కొనసాగాయి.  నల్లగొండ బాలికల జట్టుతో జరిగిన పోటీలో ఖమ్మం బాలికల జట్టు గెలుపొందింది.  

ఫైనల్​ పోటీలో ఖమ్మం బాలుర టీమ్ పై హైదరాబాద్​ టీమ్​విజయం సాధించింది. పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, భద్రాచలం ఐటీడీఏ పీవో బి.రాహుల్, కొత్తగూడెం డీఎఫ్ వో యు.కోటేశ్వరరావు విజేతలకు బహుమతులను అందించారు.  స్కూల్​హెచ్ఎం కొమరం నాగయ్య అధ్యక్షతన క్రీడా పోటీలు నిర్వహించారు.  

వచ్చే జనవరిలో నేషనల్​లెవల్​అండర్​–17బాలుర కబడ్డీ పోటీలను కూడా ఇదే గ్రౌండ్​లో నిర్వహిస్తారు.  కలెక్టర్​జితేశ్​వి పాటిల్​పర్యవేక్షణలో అన్ని డిపార్ట్​మెంట్ల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పోటీలను విజయవంతంగా నిర్వహించారు.  కేజీబీవీ బాలికల సాంస్కృతిక  ప్రదర్శన ఆకట్టుకుంది. తహసీల్దార్  గోపాలకృష్ణ, ఎంపీడీవో సంకీర్త్​, జిల్లా స్పోర్ట్స్​ఆఫీసర్​వాసిరెడ్డి నరేశ్​పాల్గొన్నారు.