కామారెడ్డి జిల్లాలో 24 గంటల కరెంట్ కోసం ఆందోళన

కామారెడ్డి జిల్లాలో  24 గంటల కరెంట్ కోసం ఆందోళన

పిట్లం, వెలుగు : 24 గంటల కరెంట్ ఇవ్వాలని డిమాండ్​ చేస్తూ కామారెడ్డి జిల్లా జుక్కల్​మండలం బస్వాపూర్ రైతులు మంగళవారం ఆందోళనకు దిగారు. మంగళవారం జుక్కల్​సబ్​స్టేషన్ ​ముందు రోడ్డుపై ధర్నా చేశారు. కరెంట్​ లేక పంటలు ఎండుతున్నాయని, ఎండిన పత్తి , శనగ పంటలను కరెంట్​ఆఫీసర్లకు చూపిస్తూ నిరసన తెలిపారు. 

ప్రభుత్వం 24 గంటల కరెంట్​ సరఫరా చేస్తున్నామని చెబుతున్నా ఇక్కడ మాత్రం సరఫరా లేక పంటలు ఎండుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే పురుగుల మందు తాగే పరిస్థితి వస్తుందని వాపోయారు. రోడ్డుపై వాహనాలు నిలిచిపోవడంతో పోలీసులు రైతు లకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా పట్టు విడవలేదు. ఏఈఈ మోహన్​ రైతులతో మాట్లాడి సాధ్యమైనంత తొందరగా 24 గంటలు కరెంట్​సరఫరా అయ్యేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.