గురుకులం ముందు కాంగ్రెస్ నేతల ఆందోళన

గురుకులం ముందు కాంగ్రెస్ నేతల ఆందోళన

వికారాబాద్ జిల్లా: కుల్కచర్లలోని ట్రైబల్ వెల్ఫేర్ గురుకులం దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. గురుకులం ముందు కాంగ్రెస్ నేతలు, స్థానికులు ఆందోళనకు దిగారు. గురుకులంలో సమస్యలపై ప్రిన్సిపల్ ను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ టైమ్ లో ప్రిన్సిపల్ తో వాగ్వాదం జరిగింది. సమస్యలపై తననే ప్రశ్నిస్తారా అంటూ  ప్రిన్సిపల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

దీంతో కాంగ్రెస్ నాయకులు తహశీల్దార్, MEO కు ప్రిన్సిపాల్ పై కంప్లైంట్ చేశారు. విద్యార్థుల సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రిన్సిపల్ ను సస్పెండ్ చేయాలని గురుకులం ముందు బైఠాయించారు. పోలీసులు నిరసనకారులను అడ్డుకునేందుకు యత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆందోళన చేస్తున్నవారిని పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించారు.