జీతాల కోసం శ్రీచైతన్య కాలేజీ లెక్చరర్ల ఆందోళన

జీతాల కోసం శ్రీచైతన్య కాలేజీ లెక్చరర్ల ఆందోళన

హైదరాబాద్: జీతాల కోసం శ్రీచైతన్య కళాశాల చైతన్యపురి పాకాల బ్రాంచ్ లో పనిచేస్తున్నఅధ్యాపకులు ఆందోళన చేపట్టారు. సంవత్సరం నుంచి యాజమాన్యం జీతాలు ఇవ్వకుండా వేధిస్తుందని తెలిపారు లెక్చరర్స్. విద్యార్థుల నుంచి లక్షల రూపాయలు ఫీజులు వసూలు చేస్తూ,  జీతాలు చెల్లించకుండా లెక్చరర్ల జీవితాలతో ఆడుకుంటున్న  శ్రీచైతన్య కాలేజీ యాజమాన్యంపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

పనిచేసిన కాలానికి జీతాలు చెల్లించి, ఉద్యోగులోకి విధుల్లోకి తీసుకోవాలని ప్రశ్నిస్తే, ఉద్యోగం నుంచి తొలగించి  కొత్తవారిని తీసుకున్నారని చెప్పారు. దీంతో కొంతమంది అధ్యాపకులు మనోవేదనకు గురై క్లాసు రూంలోకి వెళ్లి స్వీయ నిర్బంధం చేసుకున్నారు. తక్షణమే శ్రీచైతన్య యాజమాన్యం బకాయి జీతాలు చెల్లించి, విధుల్లోకి తీసుకునేవరకు ఆందోళన కోనసాగుతదని  హెచ్చరించారు తెలంగాణ ప్రైవేటు లెక్చరర్స్.