జగిత్యాల మాస్టర్ ప్లాన్: పండగపూట ఆగని నిరసనలు

జగిత్యాల మాస్టర్ ప్లాన్: పండగపూట ఆగని నిరసనలు

జగిత్యాల టౌన్ మాస్టర్ ప్లాన్ పై ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. మాస్టర్ ప్లాన్  కు వ్యతిరేకంగా పండగ పూట కూడా రైతులు ఆందోళనకు దిగారు.  జగిత్యాల రూరల్ మండలం నర్సింగాపూర్ గ్రామ ప్రజలు మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయాలంటూ  పంచాయతీ కార్యాలయం ఎదుట  బైఠాయించి నిరసన తెలిపారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ  జీవన్ రెడ్డి ఈ నిరసనలో పాల్గొని వారికి మద్దతు తెలిపారు.

నిన్న భోగి రోజున కూడా మోతె, తిమ్మాపూర్, నర్సింగాపూర్  గ్రామాల్లో చాలా మంది రైతులు ముగ్గులు వేసి స్టాప్ రిక్రియేషన్ జోన్, స్టాప్ మాస్టర్ ప్లాన్, సర్పంచ్, ఉపసర్పంచ్,వార్డ్ మెంబర్, ఎంపీటీసీలు రాజీనామా చేయాలని ముగ్గులు వేశారు.  మాస్టర్ ప్లాన్ నుంచి తమ భూములను తొలగించకపోతే మరో ఉద్యమం తప్పదంటూ హెచ్చరించారు.