ఓట్లడిగే పరిస్థితిలో కాంగ్రెస్ లేదు : జై రామ్ ఠాకూర్

ఓట్లడిగే పరిస్థితిలో కాంగ్రెస్ లేదు : జై రామ్ ఠాకూర్

వచ్చే 25 ఏళ్ల పాటు హిమాచల్లో బీజేపీ గెలుస్తుందని ఆ రాష్ట్ర సీఎం  జై రామ్ ఠాకూర్ జోస్యం చెప్పారు. హిమాచల్లో 1982 నుంచి జరిగిన ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వం మారుతూ వస్తుందని..ఆయితే ఈ సారి ప్రజలు ఆ సంప్రదాయాన్ని మార్చబోతున్నారన్నారు. హిమాచల్  ప్రజలు అభివృద్ధిని చూశారని.. బీజేపీని తిరిగి అధికారంలోకి తీసుకురావాలని నిర్ణయించుకున్నారని ఠాకూర్ చెప్పారు.

రాష్ట్రంలో ఓట్లు అడిగే పరిస్థితిలో అసలు కాంగ్రెస్ లేదని ఠాకూర్ విమర్శించారు. నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లను  నియమిస్తే అందులో ఇద్దరు బీజేపీలో చేరారని చెప్పారు.అధికారంలోకి వస్తే 18 నుంచి 60 ఏళ్లలోపు మహిళలకు నెలకు రూ. 1,500 ఇస్తానని కాంగ్రెస్ హామీ ఇవ్వడంపై ఠాకూర్ స్పందించారు. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లోని మహిళలకు కాంగ్రెస్ అక్కడ రూ. 1,500 ఇస్తుందా అని  ప్రశ్నించారు. నవంబర్ 12 న హిమాచల్లో పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 8 న ఫలితాలు వెలువడనున్నాయి.