బేతవోలు గ్రామంలో స్వల్ప ఉద్రిక్తత

బేతవోలు గ్రామంలో స్వల్ప ఉద్రిక్తత

సూర్యాపేట జిల్లా కోదాడ అధికార పార్టీలో వర్గ పోరు మరో మారు బయటపడింది.  చిలుకూరు మండలం బేతవోలు గ్రామంలో ఆసరా పెన్షన్, బతుకమ్మ చీరల పంపిణీలో గందరగోళం జరిగింది. దీంతో పోలీసులకు, గ్రామస్తులకు మధ్య తోపులాట జరిగింది. బేతవోలు గ్రామంలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, బతుకమ్మ చీరలు, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే బొల్లం పాల్గొననున్నారు.

అందులో భాగంగా గ్రామపంచాయతీ ఆవరణలో పంచాయతీ పాలకవర్గం తగిన ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలో కార్యక్రమాన్ని గ్రామపంచాయతీ ఆవరణలో పెట్టాలని సర్పంచ్ వర్గం పట్టుబట్టింది. ఈ సమయంలో కళ్యాణ మండపంలో చెక్కుల పంపిణికి ఎమ్మెల్యే వర్గం ఏర్పాట్లు చేయడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. గత కొంత కాలంగా గ్రామపంచాయతీ సర్పంచ్ భర్తకి, ఎమ్మెల్యే మధ్య వర్గం పోరు సాగుతోంది.