బూనియా: ఆఫ్రికా ఖండంలోని కాంగోను ఎబోలా వైరస్ వణికిస్తోంది. దేశంలోకి ఎబోలా ప్రవేశించినట్లు కాంగో ప్రభుత్వం అధికారికంగా ప్రకటించి నెల కూడా గడవక ముందే పరిస్థితి తీవ్ర రూపం దాల్చింది. మే 15న తూర్పు కాంగోలో ఎబోలా మొదటి కేసును గుర్తించగా.. ప్రస్తుతం ఈ కేసుల సంఖ్య 550 కి చేరింది. అందులో కేవలం 19 మంది మాత్రమే కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా, మిగతా101మంది మృతిచెందారు.
మిగతావారు ట్రీట్మెంట్ పొందుతున్నారు. అయితే, ఎబోలాతో మరణాల సంఖ్య ఇంకా పెరుగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధానంగా కాంగో తూర్పు ప్రావిన్స్ అయిన ఇటూరి ప్రాంతంలో వ్యాధి ప్రభావం ఎక్కువగా ఉందని తెలిపారు. మొత్తం కేసుల్లో దాదాపు 90 శాతానికి పైగా కేసులు ఇక్కడే నమోదయ్యాయని వివరించారు.
