ఆర్డినెన్స్ మా వల్లే : బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు

ఆర్డినెన్స్ మా వల్లే  :  బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు

హైదరాబాద్, వెలుగు: తమ ఒత్తిడితోనే కాం గ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుపై ఆర్డినెన్స్ తీసుకురావాలని నిర్ణయిం చిందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు అన్నారు. అయితే, అసెంబ్లీని ప్రోరోగ్ చేసి ఆర్డినెన్స్ తీసుకురావడంపై తమకు అనుమానాలు ఉన్నాయని చెప్పారు. శుక్రవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి ఏపీ నుంచి ఇప్పటివరకు ఒక్క బీసీని కూడా కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా నియమించలేదని ఆరోపించారు. 

ఆర్డినెన్స్‌‌‌‌ను 3 నెలల కిందటే తెచ్చివుంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడో పూర్తయ్యేవని తెలిపారు.  సెప్టెంబర్ 30లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా.. రేవంత్ ప్రభుత్వం ఎన్నికల నిర్వహణ ఆలస్యం చేస్తోందని మండిపడ్డారు. ఆర్డినెన్స్‌‌‌‌ను ఎటువంటి న్యాయపరమైన అడ్డంకులు లేకుండా అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాజీనామా నిర్ణయాన్ని ఎమ్మెల్యే రాజాసింగ్  స్వచ్ఛందంగా, వ్యక్తిగతంగా తీసుకున్నారని కాసం వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.