కరోనా ఎఫెక్ట్.. మేకెదాటు పాదయాద్ర వాయిదా

కరోనా ఎఫెక్ట్.. మేకెదాటు పాదయాద్ర వాయిదా

బెంగళూరు : కర్నాటకలో కాంగ్రెస్ తలపెట్టిన మేకెదాటు పాదయాత్రను నిలిపివేస్తున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. మేకెదాటు ప్రాజెక్టు ఆలస్యంపై బీజేపీని ప్రశ్నించేందుకు చేపట్టిన ఈ యాత్రలో పాల్గొన్న వారిలో చాలా మంది కరోనా బారిన పడ్డారు. యాత్రలో భాగస్వాములైన రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గేతో పాటు మరో సీనియర్ నేత వీరప్ప మొయిలీలకు కోవిడ్ పాజిటివ్ నిర్థారణ అయింది. రాష్ట్ర కాంగ్రెస్ నేతలైన మాజీ సీఎం సిద్ధరామయ్య, ఎమ్మెల్యే లక్ష్మీ, బెంగళూరు మాజీ మేయర్ గంగాంబికే మల్లికార్జున్‌తదితరులకు సైతం కరోనా లక్షణాలు బయటపడ్డాయి. ఈ క్రమంలో రాహుల్ గాంధీ సూచన మేరకు పాదయాత్రను నిలిపివేస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టిన తర్వాత మళ్లీ పాదయాత్ర ప్రారంభిస్తామని చెప్పింది. 

కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్న సమయంలో కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తూ కాంగ్రెస్ చేపట్టిన మేకెదాటు పాదయాత్రపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వందలాది మంది పాల్గొంటుండటంతో బీజేపీ నేతలు ఈ ర్యాలీని సూపర్ స్ప్రెడర్గా అభివర్ణిస్తున్నారు. మరోవైపు యాత్రలో కోవిడ్ నిబంధనలు పాటించకపోవడంతో ఇప్పటికే ప్రతిపక్ష నేత సిద్ధరామయ్యతో పాటు మరో 60 మందిపై కేసులు నమోదయ్యాయి. మేకెదాటు పాదయాత్రపై సీరియస్ అయిన హైకోర్టు శుక్రవారంలోగా వివరణ ఇవ్వాలని అధికార, ప్రతిపక్ష పార్టీలను ఆదేశించింది. ఈ క్రమంలో కర్నాటక సీఎం బసవరాజ్ బొమ్మై సైతం ర్యాలీని వెంటనే ఆపాలంటూ కాంగ్రెస్కు లేఖ రాశారు. ఈ పరిణామాలన్నింటి దృష్ట్యా కాంగ్రెస్ ర్యాలీని నిలిపివేసింది. 

For more news

ఎస్ఎంఎస్ ద్వారా సీఎం అభ్యర్థి ఎంపిక

నకిలీ కాల్ సెంటర్ ముఠా అరెస్ట్