ఆప్‌ కార్యకర్తపై చేయి చేసుకోబోయిన అల్కా లాంబా

ఆప్‌ కార్యకర్తపై చేయి చేసుకోబోయిన అల్కా లాంబా

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ నేతల మధ్య గొడవ జరిగింది. మజ్ను కా తీలా దగ్గర కాంగ్రెస్‌ అభ్యర్థి అల్కా లాంబా ఆప్‌ కార్యకర్త  చెంప చెల్లుమనిపించేందుకు ప్రయత్నించారు. వెంటనే ఆ వ్యక్తి అలర్టై పక్కకు తప్పుకున్నాడు. అల్కాలాంబా చేయి చేసుకునేందుకు ప్రయత్నించడంపై ఆప్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో రెండు పార్టీల కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఒకరిని ఒకరు తోసుకున్నారు. పోలీసులు కలగజేసుకుని వారిని విడదీసి..అక్కడి నుంచి పంపించేశారు. అల్కా లాంబా తీరును తప్పుపట్టిన ఆప్ నేత సంజయ్ సింగ్..ఈ ఘటనపై ఎలక్షన్‌ కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.