కాంగ్రెస్​ సర్కార్​ ఇచ్చిన భూములను బీఆర్​ఎస్​ గుంజుకుంది : మురళీనాయక్​

కాంగ్రెస్​ సర్కార్​ ఇచ్చిన భూములను బీఆర్​ఎస్​ గుంజుకుంది : మురళీనాయక్​

మహబూబాబాద్ అర్భన్​, వెలుగు: కాంగ్రెస్​ పార్టీ దళిత, గిరిజనులకు ఇచ్చిన భూములను బీఆర్ఎస్​ ప్రభుత్వం బలవంతంగా గుంజుకుందని కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థి డాక్టర్​ మురళీనాయక్​ అన్నారు. మంగళవారం మహబూబాబాద్​ మండలం అయోద్య, అమనగల్లు, ముడుపుగల్లు శివారు తండాలలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.  బడుగుబలహీన వర్గాల అభిన్నతి కోసం కాంగ్రెస్​ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిరుపేదలకు భూములు ఇచ్చిందన్నారు.   

ప్రతి గ్రామానికి ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చి ఇంటింటికి సంక్షేమ పథకాలు అందించిన ఘనత కాంగ్రెస్​ ప్రభుత్వానిదే అన్నారు.  కనీసం తెలంగాణ వచ్చిన పదేళ్లలో  ఏ ఒక్క పేదవాడికి రేషన్​కార్డు ఇవ్వకపోగ ఉన్న రేషన్​కార్డులను  బీఆర్​ఎస్​ ప్రభుత్వం తొలగించిందన్నారు.  మిగులు బడ్జెట్​తో ప్రారంభమైన తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం 5లక్షల కోట్ల అప్పుతో అర్థికంగా   దివాళా  తీసిందన్నారు.  రాష్ట్రంలో బీఆర్​ఎస్​ గుండాలు, భూకబ్జాలు,ఆన్​లైన్​ దందాలతో పాటు అక్రమ రియల్​ఎస్ట్రేట్​ వ్యాపారాలతో కోట్లకు పడిగెత్తి పేదలను నిట్టనిలువున ముంచుతున్నారని అన్నారు.