మీ ఓటే మాకు అభయ హస్తం : గడ్డం వినోద్

మీ ఓటే మాకు అభయ హస్తం : గడ్డం వినోద్

బెల్లంపల్లి రూరల్, వెలుగు : మీ ఓటే మాకు అభయ హస్తమని బెల్లంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్​ఎమ్మెల్యే అభ్యర్థి గడ్డం వినోద్​అన్నారు. సోమవారం నెన్నెల, కోణంపేట, జంగాల్​పేట గ్రామ పంచాయతీల్లో ఆయన ఇంటింట ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్​కు మద్దతు తెలిపి చేయి గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను కోరారు. తనకు ఒక్క అవకాశమిస్తే నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.

కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్నారు. ప్రజల ఆశీర్వాదంతోనే గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన నాయకులు కాంగ్రెస్​లో చేరగా.. వినోద్​వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల అధ్యక్షుడు గట్టు మల్లేశ్, గొల్లపల్లి ఎంపీటీసీ హరీశ్​గౌడ్, కాంగ్రెస్​నాయకులు తోట శ్రీనివాస్, మహేశ్​రెడ్డి, మోహిద్​ఖాన్, బానేశ్ తదితరులు పాల్గొన్నారు. 

ALSO READ : ఆధారాలు చూపించి నగదు తీసుకోవాలి : రాజర్షి షా