ఆధారాలు చూపించి నగదు తీసుకోవాలి : రాజర్షి షా

ఆధారాలు చూపించి నగదు తీసుకోవాలి : రాజర్షి షా

మెదక్ టౌన్, వెలుగు:  జిల్లా వ్యాప్తంగా ఎన్నికల తనిఖీల్లో పట్టుబడిన నగదుకు సంబంధించి సరైన ఆధారాలు చూపించి తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్​ రాజర్షి షా సూచించారు. సోమవారం జిల్లా వ్యాప్తంగా 60 దరఖాస్తులు వచ్చాయని, అందులో 51 దరఖాస్తులకు సంబంధించిన వ్యక్తులు తగిన ఆధారాలు చూపి జిల్లా గ్రీవెన్స్ కమిటీ ద్వారా నగదు తీసుకున్నారన్నారు. 

మిగిలిన దరఖాస్తుదారులు నగదుకు సంబంధించిన ఆధారాలు తీసుకొని రావాలన్నారు. ఏదైనా అనుమానం ఉన్నట్లయితే  గ్రీవెన్స్ కమిటీ అధికారులు డీఆర్​డీవో శ్రీనివాస్​ఫోన్​ నెంబర్​ 9281484100,   జిల్లా అడిట్ అధికారి  రాకేశ్​ -9948213828,   జిల్లా ట్రెజరీ అధికారి చిన్న సాయిలు 779934 150 కు ఫోన్​ చేసి మాట్లాడవచ్చన్నారు.  

ALSO READ : బెల్లంపల్లి లో ఘనంగా దీపావళి వేడుకలు