బెల్లంపల్లి లో ఘనంగా దీపావళి వేడుకలు

బెల్లంపల్లి లో ఘనంగా దీపావళి వేడుకలు
  • వ్యాపారస్తులతో వేడుకల్లో పాల్గొన్న గడ్డం వినోద్​

బెల్లంపల్లి, వెలుగు : ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆదివారం దీపావళి వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ వేడుకల్లో పాల్గొని పటాకులు కాల్చుతూ సందడి చేశారు. భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవికి పూజలు చేశారు. ఈ సందర్భంగా బెల్లంపల్లిలోని వ్యాపారస్తులకు మాజీ మంత్రి, కాంగ్రెస్​అభ్యర్థి గడ్డం వినోద్ శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ లీడర్లు, కార్యకర్తలతో కలిసి పట్టణంలోని వ్యాపార సముదాయాల వద్దకు వెళ్లి వ్యాపారస్తులకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వినోద్ మాట్లాడుతూ.. పట్టణంలోని వ్యాపారస్తులు తనకు ఓట్లు వేసి గెలిపించుకోవాలని, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి ఏ సమస్య ఉన్నా పరిష్కరిస్తానన్నారు.

బెల్లంపల్లిలో వ్యాపార సముదాయాలను మరింత అభివృద్ధి చేసేందుకు సహకరిస్తానన్నారు. పదేండ్లపాటు అధికారంలో ఉన్న దుర్గం చిన్నయ్య ఇక్కడ అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. వినోద్ వెంట మున్సిపల్ మాజీ చైర్మన్ మత్తమారి సూరిబాబు, కాంగ్రెస్ లీడర్లు నల్లా చక్రపాణి, నాతరి స్వామి, మేడి పున్నంచంద్రు, జమ్మికుంట విజయ్ కుమార్, మేకల శ్రీనివాస్, బత్తుల రవి, మత్తమారి సత్తిబాబు, ఆదర్శ్ వర్దన్ రాజు, లెంకల శ్రీనివాస్, కొండబత్తిని రామ్మోహన్, వ్యాపారస్తులు బాలాజి సోని, దిలీప్ కుమార్ సోని, కమల్ కిషోర్ అగర్వాల్, గుండేటి సతీష్, కమల్ లాహోటి తదితరులు ఉన్నారు.        

ALSO READ : బంగాళాఖాతంలో అల్పపీడనం.. భారీ వర్షాలు పడే అవకాశం