ఆరు గ్యారెంటీలు అమలు చేస్తం : అనిల్‌‌ రెడ్డి

ఆరు గ్యారెంటీలు అమలు చేస్తం :  అనిల్‌‌ రెడ్డి

యాదాద్రి, వెలుగు :  పవర్​లోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీ స్కీమ్‌లను అమలు చేస్తామని భువనగిరి కాంగ్రెస్​ అభ్యర్థి కుంభం అనిల్​కుమార్​ రెడ్డి తెలిపారు.  సోమవారం  వలిగొండ, భువనగిరి, బీబీనగర్​ మండలాల్లోని పలు గ్రామాల్లో ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరు గ్యారెంటీలకు సంబంధించిన కరపత్రాలను ఓటర్లకు అందించారు. గత ఎన్నికల్లో తాను ఓడినా.. ప్రజల మధ్యే ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టం చేశారు. సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందని, ఆమె రుణం తీర్చుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. ముందుగా నమాత్​పల్లిలో  శ్రీ పూర్ణగిరి సుదర్శన లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.