ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది : దామోదర రాజనర్సింహ

ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్  కట్టుబడి ఉంది : దామోదర రాజనర్సింహ

హైదరాబాద్​: ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టులో   సానుకూలంగా తీర్పు వస్తుందని ఆశిస్తున్నామని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఇవాళ మీడియాతో ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు. సామాజిక న్యాయం జరగాలంటే వర్గీకరణ ఒక భాగమన్నారు. ఎస్సీ సబ్ ప్లాన్ ఒకటన్నారు. ఈరోజు నుంచి ఏడుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం వాదనలు ప్రారంభించిందన్నారు. ఇందులో తెలంగాణ ప్రభుత్వం కూడా భాగమైన నేపథ్యంలో తామంతా  సుప్రీంకోర్టుకు వచ్చామన్నారు.  తెలంగాణ తరఫున సీనియర్ న్యాయవాది వివేక్ థన్కా ను ప్రభుత్వం నియమించిందన్నారు. సీఎం రేవంత్ ప్రత్యేక చొరవ తీసుకుని ఈ ఏర్పాట్లు చేయడంతో పాటు   డైరెక్షన్ ఇచ్చారన్నారు.  ఎస్సీ వర్గీకరణ ఎవరికీ వ్యతిరేకం కాదన్నారు. ఎస్సీల్లో ఎవరి వాటా వారికి దక్కాలని ఆయన చెప్పారు.