రాబోయేది కాంగ్రెస్ డబుల్ ఇంజన్ సర్కార్ : జీవన్ రెడ్డి

రాబోయేది కాంగ్రెస్ డబుల్ ఇంజన్ సర్కార్ : జీవన్ రెడ్డి

రాబోయేది కాంగ్రెస్ డబుల్ ఇంజన్ సర్కార్ అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కల్పించడం ప్రధానమైన అంశమని చెప్పారు. జగిత్యాల జిల్లా రాయికల్ లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రుణగ్రస్తుడైన రైతును రుణ విముక్తుడిని చేయడానికి యూపీఏ ప్రభుత్వం ఏకకాలంలో లక్ష రూపాయల రుణమాఫీ చేసిందని గుర్తు చేశారు. 

దేశ భవిష్యత్తును నిర్ణయించేది యువత అని అలాంటి యువతకు ఉద్యొగు, ఉపాధి కల్పన ప్రభుత్వాల బాధ్యత అని చెప్పారు. 2014లో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న మోదీ 10 ఏళ్ళు గడిచిన ఒక్క ఉద్యోగం కూడా కల్పించలేకపోయాడని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసి అమ్మకానికి పెట్టారని విమర్శించారు. 

ALSO READ :- జగన్ ను టార్గెట్ చేసిన షర్మిల - వైసీపీ నుండి కాంగ్రెస్ లోకి వలసలు

కేంద్ర ప్రభుత్వం ఒక వ్యాపార సంస్థ అయిపోయిందని ఫైర్ అయ్యారు. రైతులకు రుణమాఫీ చేస్తే సోమరిపోతులవుతారని అంటూనే, అంబానీ ఆదానిలకు లక్షల కోట్లు మాఫీ చేశారని జీవన్ రెడ్డి తెలిపారు.