కార్మికుల హక్కులు కాంగ్రెస్‌తోనే సాధ్యం : యరగాని నాగన్న గౌడ్

కార్మికుల హక్కులు కాంగ్రెస్‌తోనే సాధ్యం :  యరగాని నాగన్న గౌడ్

ఐఎన్‌టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్న గౌడ్

హుజూర్ నగర్, వెలుగు: దేశం, రాష్ట్రంలో మొదటి నుంచి కార్మిక హక్కులు కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమయ్యాయని ఐఎన్‌టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్న గౌడ్ అన్నారు. సోమవారం హుజూర్‌‌నగర్‌‌ ఇందిరా భవన్‌లో ఐఎన్‌టీయూసీ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. రాష్ట్రంలో 25 లక్షల మంది బిల్డింగ్ కన్స్ స్ట్రక్షన్ కార్మికులకు ఎక్స్‌ గ్రేషియా, ప్రమాద బీమా పెంపు పట్ల హర్షం వ్యక్తం చేస్తూ యరగాని నాగన్న గౌడ్‌కు సన్మానం చేశారు. 

ఈ సందర్భంగా నాగన్న గౌడ్ మాట్లాడుతూ..  సీఎం రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కార్మిక శాఖ మంత్రి  వివేక్ వెంకటస్వామి కార్మికుల శ్రేయస్సు, సంక్షేమం కోసం తీసుకున్న నిర్ణయం పట్ల కృతజ్ఞతలు తెలియజేశారు. 2011లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెల్ ఫేర్ బోర్డు ద్వారా ఎక్స్ గ్రేషియా, ప్రమాద బీమా అందించారన్నారు.

  కార్మికులకు రావాల్సిన బకాయిలను, బెనిఫిట్స్‌ను అందించేందుకు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సహకారంతో కృషి చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఎక్స్ గ్రేషియా, ప్రమాద బీమా ప్రభుత్వం పెంచిందన్నారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జునరావు, బెల్లంకొండ గురవయ్య, చిట్యాల అమర్నాథ్ రెడ్డి, ముక్కంటి, సలిగంటి జానయ్య, చింతకాయల రాము, కందుల వెంకన్న, శీలం వీరయ్య, నూకపంగు నాగయ్య, సోమ వెంకన్న, పోలగాని శ్రీనివాస్, కందుల శీను, కృష్ణారెడ్డి, శేఖర్ రెడ్డి, విక్రమ్, అఫ్జల్, సంజీవరెడ్డి, భాస్కర్,తదితరులు పాల్గొన్నారు.