హుస్నాబాద్ మున్సిపల్  పీఠం కాంగ్రెస్ దే : హౌజ్ ఫెడ్ మాజీ చైర్మన్ బొమ్మ శ్రీరామ్

హుస్నాబాద్ మున్సిపల్  పీఠం కాంగ్రెస్ దే : హౌజ్ ఫెడ్ మాజీ చైర్మన్ బొమ్మ శ్రీరామ్
  • .హౌజ్ ఫెడ్ మాజీ చైర్మన్ బొమ్మ శ్రీరామ్

హుస్నాబాద్, వెలుగు: హుస్నాబాద్ మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని రాష్ట్ర హౌజ్ ఫెడ్ మాజీ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి  ధీమా వ్యక్తం చేశారు. బుధవారం స్థానిక 14వ వార్డులోని సిద్ధార్థ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పట్టణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని పేర్కొన్నారు.

రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ జోడెద్దుల తరహాలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారన్నారు. పొన్నం ప్రభాకర్ చిత్తశుద్ధితో హుస్నాబాద్ మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దుతారని, ఆ మార్పును ప్రజలు త్వరలోనే చూడబోతున్నారని వెల్లడించారు. కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్, నాయకులు రాహుల్, రాములు పాల్గొన్నారు.