ప్రజా సమస్యల ప్రస్తావనేదీ?: మోదీపై కాంగ్రెస్ ఫైర్

ప్రజా సమస్యల ప్రస్తావనేదీ?: మోదీపై కాంగ్రెస్ ఫైర్

న్యూఢిల్లీ:  మన్ కీ బాత్ ప్రసంగంలో దేశ ప్రజలు ఎదుర్కొంటున్న ఒక్క సమస్యను కూడా మోదీ ప్రస్తావించ లేదని కాంగ్రెస్ విమర్శించింది. మోదీ నోటి వెంట తమ సమస్యల గురించి వినాలని ప్రజలు కోరుకున్నారని,కానీ వారి సమస్యలను ఆయన పట్టించు కోలేదని కాంగ్రెస్ మీడియా, పబ్లిసిటీ విభాగం చీఫ్ పవన్ ఖేరా విమర్శిం చారు. నీట్ ఎగ్జాంలో అవకతవకలు, రైల్వే యాక్సిడెంట్, బ్రిడ్జిలు, ఇతర నిర్మాణాలు కూలిపోవడంపై మోదీ ఎందుకు స్పందించలేదో చెప్పాల న్నారు.

‘‘మోదీ మూడోసారి అధికారంలోకి వచ్చినా.. ఆయన ప్రభుత్వం ఈసారి సొంత బలంతో కాకుండా క్రచెస్ (మిత్రపక్షాల) సాయంతో నడుస్తోంది. ఈసారైనా సీరియస్ అంశాలపై స్పందిస్తారని అనుకుంటే దేనినీ ప్రస్తావించలేదు. నీట్, స్కాంల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రధాని కేరళ గొడుగుల గురించి మాట్లాడారు” అని ఖేరా విమర్శలు గుప్పించారు.