కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌తో సొంతింటి కల సాకారం : ఎమ్మెల్యే సంజయ్ కుమార్

కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌తో సొంతింటి కల సాకారం :  ఎమ్మెల్యే సంజయ్ కుమార్

జగిత్యాల రూరల్, వెలుగు: ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదల సొంతింటి కలను కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ సాకారం చేస్తోందని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల రూరల్ ఎంపీడీవో ఆఫీస్ లో ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాలను 83 మంది లబ్ధిదారులకు  పంపిణీ చేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగిత్యాల నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని, అందులో జగిత్యాల మండలానికి 794 వచ్చినట్లు చెప్పారు. సాంకేతిక కారణాలతో అర్హులకు ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో రమాదేవి, మండల ప్రత్యేక అధికారి నరేశ్‌‌‌‌‌‌‌‌, ఎంపీవో రవిబాబు, ప్రజాప్రతినిధులు  పాల్గొన్నారు.