నిరూపిస్తే రాజీనామాకు రెడీ: గులాం నబీ ఆజాద్

నిరూపిస్తే రాజీనామాకు రెడీ: గులాం నబీ ఆజాద్

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీలో ఓ లేఖ తీవ్ర దుమారం రేపుతోంది. పార్టీ నాయకత్వంలో మార్పులను కోరుతూ 23 మంది సీనియర్ లీడర్లు అధినేత్రి సోనియాకు లెటర్ రాశారు. ఇప్పుడు ఈ లెటర్‌‌ పార్టీలో వివాదాస్పద కేంద్రంగా మారింది. ఒకవైపు బీజేపీతో పోరాడటం కోసం కార్యకర్తల్లో ఉత్తేజం నింపడానికి కొత్త నాయకత్వం అవసరం ఉందని లెటర్‌‌ రాసిన నేతలు అంటున్నారు. మరోవైపు రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లో బీజేపీతో ఫైట్ చేస్తున్న టైమ్‌లో నాయకత్వ మార్పును కోరడమేంటని రాహుల్ గాంధీ లాంటి నేతలు ప్రశ్నిస్తున్నారు.

లెటర్‌‌ రాసిన నేతలు బీజేపీకి అనుకూలంగా పని చేస్తున్నారని కొందరు కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ వివాదంపై సోనియాకు లెటర్ రాసిన నేతల్లో ఒకరైన సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ స్పందించారు. బీజేపీకి అనుకూలంగా ఏ విధంగానైనా తాను పని చేసినట్లు నిరూపిస్తే కాంగ్రెస్‌కు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఆజాద్ చెప్పారని సమాచారం. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో లెటర్‌‌పై చర్చ సందర్భంగా ఆజాద్ ఈ వ్యాఖ్యలు చేశారని తెలిసింది. మరో సీనియర్ నేత కపిల్ సిబాల్ కూడా వివరణ ఇచ్చారు. గత 30 ఏళ్లలో ఏనాడూ బీజేపీకి అనుకూలంగా ఏ విషయంలోనూ తాను మాట్లాడలేదన్నారు. రాజస్థాన్‌లో సర్కార్‌‌ను నిలబెట్టేందుకు కాంగ్రెస్‌ తరఫున నిలిచామన్నారు.