
జనగామ, వెలుగు : బీసీలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం నిలుస్తుందని జనగామ డీసీసీ ప్రెసిడెంట్ కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఆయన టీపీసీసీ జనరల్ సెక్రటరీలు బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఈవీ శ్రీనివాసరావుతో కలిసి మాట్లాడారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటినీ కేవలం 20 నెలల్లోనే అమలు చేసిన ఘనత తమ ప్రభుత్వానిదన్నారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించే చిత్తశుద్ధి కాంగ్రెస్‌కే ఉందన్నారు. అసెంబ్లీలో బీసీ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించడంపై హర్షం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్ష కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. సమావేశంలో పార్టీ మండలాధ్యక్షుడు లింగాల నర్సిరెడ్డి, బ్లాక్కాంగ్రెస్అధ్యక్షుడు మెరుగు బాలరాజు గౌడ్, టౌన్ ప్రెసిడెంట్ చెంచారపు బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.