ఆడబిడ్డలకు సర్కారు సారె : షబ్బీర్ అలీ

ఆడబిడ్డలకు సర్కారు సారె : షబ్బీర్ అలీ

కామారెడ్డి, వెలుగు : మహిళల ఆర్థిక ఉన్నతికి కాంగ్రెస్​ ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పేర్కొన్నారు. సోమవారం దోమకొండలో  ఇందిరమ్మ చీరలు పంపిణీ చేసి మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో నాసిరకం చీరలు ఇచ్చారని, కాంగ్రెస్​ ప్రభుత్వం నాణ్యత గల చీరలు పంపిణీ చేస్తుందన్నారు.  కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టిన ఓట్ చోర్ సంతకాల సేకరణలో ఆయన పాల్గొని మాట్లాడారు.  బీజేపీ ఎన్నికల టైంలో ఓట్​చోరీకి పాల్పడుతుందని విమర్శించారు. జిల్లా కేంద్రంలో దూప దీప నైవేధ్య చెక్​లను షబ్బీర్అలీ పంపిణీ చేశారు.    

లింగంపేటలో.. 

లింగంపేట : లింగంపేటలో సోమవారం ఎమ్మెల్యే  మదన్మోహన్​రావు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేసి మాట్లాడారు. అమ్మలు, అక్కాచెల్లెళ్లకు ప్రభుత్వం తరఫున  సారె పెడుతున్నామన్నారు. నియోజకవర్గంలోని 3500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని, నిర్మాణాలు వేగంగా సాగుతున్నాయన్నారు. డ్వాక్రా సంఘాల మహిళలకు రూ.10 కోట్లతో పెట్రోల్​ బంక్ ను ​ఏర్పాటు చేస్తున్నామని  స్థల సేకరణ పూర్తయ్యిందని చెప్పారు. మోతె శివారులో రూ.2 వందల కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరైనట్లు తెలిపారు.  ఎంపీడీవో నరేశ్,తహసీల్దార్ సురేశ్, ఐకేపీ ఏపీఎం వినోద్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు బుర్ర నారాగౌడ్​, గౌరవాధ్యక్షుడు దశరథ్​ నాయక్, సంతోశ్​రెడ్డి, జొన్నల రాజు, ఎల్లమయ్య పాల్గోన్నారు.

నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో..

నస్రుల్లాబాద్ : నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో ఎంపీ సురేష్​ షెట్కార్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్​ రెడ్డి, అగ్రోస్​చైర్మన్ బాల్ రాజ్, కలెక్టర్ ఆశిష్​ సంగ్వాన్ ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్​ ప్రభుత్వం కోటి మంది మహిళలకు చీరలు అందించాలని నిర్ణయించిందన్నారు. మహిళలను కోటీశ్వరులను చేసేందుకు అనేక పథకాలను అమలు చేస్తున్నామన్నారు. అనంతరం మహిళలకు భోజనాలు ఏర్పాటు చేశారు.  

చీరల పంపిణీ పారదర్శకంగా జరగాలి కలెక్టర్​ వినయ్ కృష్ణారెడ్డి

ఎడపల్లి : ఇందిరమ్మ చీరల పంపిణీ పారదర్శకంగా జరగాలని కలెక్టర్​ వినయ్​కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం ఎడపల్లి మండల కేంద్రంలో చీరల పంపిణీని పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు.  కలెక్టర్ వెంట తహసీల్దార్ దత్తాద్రి, ఐకేపీ ఏపీఎం గంగారాం, సిబ్బంది ఉన్నారు.